గణితంలో 160ఏళ్ల నాటి సమస్యను ఆంథ్రోపిక్ క్లాడ్ టూల్ ద్వారా పరిష్కరించినట్లు ఆ సంస్థలో పని చేస్తున్న గణిత శాస్త్రవేత్త లెవెంట్ అల్పోజ్ ప్రకటించారు. తాను రీమన్ హైపోథీసిస్‌కు ప్రూఫ్‌ను కనుగొన్నట్లు ఆయన తెలిపారు.
రీమన్ హైపోథీసిస్ 1859 నాటి గణిత సిద్ధాంతం. ప్రధాన సంఖ్యలు (2, 3, 5, 7, 11..) పెద్దవవుతూ.. అనంతంవైపు వెళ్లేకొద్దీ ఎలా విస్తరిస్తాయో ఇది వివరిస్తుంది. ప్యూర్ మ్యాథ్స్‌లో పరిష్కారం కాని ముఖ్యమైన సమస్యల్లో ఇదీ ఒకటి.