అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంస్థ ట్యాంకు విధ్వంసక గైడెడ్ క్షిపణి (ఏటీజీఎం) వ్యవస్థ బఘీరా ఏటీ1ను విజయవంతంగా పరీక్షించింది. రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో ఈ పరీక్షలు జరిగాయి. ఇది వాహనం నుంచి ప్రయోగించే వీలున్న అస్త్రం. తాజా పరీక్షల్లో ఈ క్షిపణికి సంబంధించిన పలు సామర్థ్యాలను నిర్ధారించారు. రాత్రి, పగలు దాడి చేయగల సత్తా, రెండు అస్త్రాలను ఒకేసారి, ఒకే లక్ష్యంపైకి సంధించగలగడం, గాల్లో లక్ష్యంపైకి విరుచుకుపడగల సామర్థ్యం లాంటివి ఇందులో ఉన్నాయి.