ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు అయిన లేక్ బైకాల్ పునరుత్థానం చెందుతున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భూతాపం బారినపడి ఎండిపోతున్న ఈ సరస్సులోకి కొన్నేళ్లుగా నీటి ప్రవాహాలు పెరుగుతున్నట్లు గుర్తించారు. లేక్ బైకాల్ సైబీరియాలో ఉంది. భూమిపై ఉన్న మంచినీటిలో దాదాపు 20 శాతం ఈ సరస్సులోనే ఉండేది. దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. ఈ సరస్సులోకి సెలెంగా నది నుంచి నీరు వస్తుంది. అంగారా నది మాదుగా వెలుపలికి పోతుంది. దీని జలాలు మంగోలియాలో వ్యవసాయానికి తోడ్పడతాయి.