భూ కక్ష్యలోకి కొత్తగా ఒక చిన్న చందమామ వచ్చి చేరింది. అది చంద్రుడంత పెద్దది కాదు. చిన్న అంతరిక్ష శిల. దీన్ని ‘మినీమూన్’గా అభివర్ణిస్తున్నారు. 2026, ఏప్రిల్లో అది భూకక్ష్యలో చేరింది. దీని ఉనికిని అంతర్జాతీయ ఖగోళ సంఘం (ఐఏయూ) ఇటీవల నిర్ధారించింది. తాజా శిలకు ‘2026 క్యూక్యూ8’ అని పేరుపెట్టారు. ఇది దీర్ఘకాలం పాటు మనతో ఉండదు. వచ్చే ఏడాది జనవరిలో అది భూకక్ష్య నుంచి వెలుపలికి వెళ్లిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.