ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లకు భారతీయ పేటెంట్‌

ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లకు భారతీయ పేటెంట్‌
  • విద్యుత్తు వాహనాల (ఈవీ) ఛార్జింగ్‌ స్టేషన్లను మరింత సమర్థంగా, పర్యావరణ హితంగా మార్చే ఒక కొత్త టెక్నాలజీకి రవుర్కెలాలోని ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ (ఎన్‌ఐటీ) పేటెంట్‌ సాధించింది. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా విద్యుత్తు వాహనాల వాడకం భారీగా పెరగడంతో, ఛార్జింగ్‌ స్టేషన్ల అవసరం కూడా పెరిగింది. స్టేషన్లు నిర్మించడమే కాకుండా, వాటి డిజైన్‌లో సాంకేతిక సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

  • రవుర్కెలా ఎన్‌ఐటీ శాస్త్రవేత్తలు సౌరశక్తి ఆధారిత ఈవీ ఛార్జింగ్‌ మైక్రోగ్రిడ్‌ను రూపొందించింది. ఇది సోలార్‌ ప్యానెల్స్, సాధారణ కరెంట్‌ గ్రిడ్, బ్యాటరీలు, సూపర్‌ కెపాసిటర్లతో కూడిన ప్రత్యేక ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌ను అనుసంధానిస్తుంది. వోల్టేజీని ఈ కొత్త టెక్నాలజీ నియంత్రించగలదు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram