అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రయోగించిన వాయేజర్-1 వ్యోమనౌక ఒక అద్భుత రికార్డును సృష్టించబోతోంది. భూమి నుంచి ఒక కాంతి రోజు (లైట్ డే) దూరంలోకి వెళ్లబోతోంది. తద్వారా ఆ ఘనత సాధించిన తొలి మానవ నిర్మిత వస్తువుగా గుర్తింపు పొందనుంది. ప్రస్తుతం ఇది పుడమి నుంచి 2,600 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది.
అక్కడి నుంచి ఈ వ్యోమనౌక పంపే సంకేతాలు.. కాంతి వేగంతో ప్రయాణించినా భూమికి చేరుకోవడానికి దాదాపు 24 గంటలు పడుతోంది. అంటే.. అది ఒక కాంతి రోజు దూరంలో ఉందన్నమాట.