నీటికొరత, ఉష్ణోగ్రత రెండింటినీ ఒకే సమయంలో అనుభవిస్తున్న కోస్తా తీర ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలకు ఉపయుక్తంగా ఉండేందుకు బిట్స్ హైదరాబాద్ ఆచార్యుడు సందీప్ దేశ్ముఖ్ ఒక రిఫ్రిజిరేటర్ యంత్రాన్ని రూపొందించారు. ఇది గాలిలోని తేమ, నీటి ఆవిరిని తీసుకుని స్వచ్ఛమైన నీటిగా మార్చుతుంది. అంతేకాకుండా ఆ తేమలేని గాలిని శీతలీకరణకు వినియోగించుకోవచ్చు.
దీనికి ఇటీవల ఇండియన్ పేటెంట్ కార్యాలయం పేటెంట్ మంజూరు చేసింది.