కోపర్‌నికైట్‌

కోపర్‌నికైట్‌
  • పోలండ్‌లోని పోజ్నాన్‌ అనే నగరం వద్ద వేల ఏళ్ల కిందట అంతరిక్షం నుంచి వచ్చి పడిన ‘మొరాస్కో మీటియోరైట్‌’ అనే శిలలో సరికొత్త ఖనిజాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి 1473 నుంచి 1543 మధ్య జీవించిన విఖ్యాత ఖగోళశాస్త్రవేత్త నికోలస్‌ కోపర్‌నికస్‌ పేరిట కోపర్‌నికైట్‌ అని నామకరణం చేశారు. ఈ మేరకు కమిషన్‌ ఆన్‌ న్యూ మినెరల్స్, నామెన్‌క్లేచర్‌ అండ్‌ క్లాసిఫికేషన్‌ ఆఫ్‌ ద ఇంటర్నేషనల్‌ మినెరెలాజికల్‌ అసోసియేషన్‌ (సీఎన్‌ఎంఎన్‌సీ-ఐఎంఏ) ఇటీవల ఆమోదం తెలిపింది.

  • 5వేల నుంచి 6వేల సంవత్సరాల మధ్య ఇది అంతరిక్షం నుంచి రాలిపడి ఉండొచ్చని అంచనా. తాజాగా ఇందులో కోపర్‌నికైట్‌ అనే ఖనిజాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇది కొత్త ఖనిజమే అయినా.. దాదాపుగా ఇదే రకం మూలకాల మిశ్రమంతో కూడిన పదార్థాలు గతంలోనూ వెలుగు చూశాయి. 1982లో ఆస్ట్రేలియన్‌ ల్యాంప్రోయిట్లలో ఇలాంటిది కనిపించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram