భారత వైమానిక దళంలో ‘గజరాజ్’గా పేరొందిన భారీ రవాణా విమానం ఐఎల్-76.. రికార్డు సృష్టించింది. తూర్పు లద్దాఖ్‌లోని 13,629 అడుగుల ఎత్తులో ఉన్న న్యోమా వైమానిక స్థావరంలో ఇది విజయవంతంగా దిగింది. ప్రపంచంలో ఈ విమానం సాధించిన అత్యంత ఎత్తయిన ల్యాండింగ్ ఇదేనని వాయుసేన తెలిపింది. ఈ ల్యాండింగ్‌ను దేశ వ్యూహాత్మక వాయు రవాణా సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే కీలక మైలురాయిగా అభివర్ణించింది.
దీనివల్ల బలగాలు, యుద్ధ ట్యాంకులు, శతఘ్నులను వేగంగా సరిహద్దుల్లోకి తరలించడానికి వీలవుతుంది. చైనాతో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)కు దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యోమా వ్యూహాత్మక వైమానిక స్థావరం.