‘ప్రళయ్’ పేరుతో రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్‌డీఓ) రూపొందించిన పాక్షిక బాలిస్టిక్ క్షిపణిని గురువారం విజయవంతంగా పరీక్షించారు. ఒడిశా తీరానికి ఆవల ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ దీవిపై దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించినట్టు రక్షణ వర్గాలు తెలిపాయి. 500 నుంచి 1,000 కిలోల బరువు మోసే సామర్థ్యం కలిగిన ఈ లఘుశ్రేణి క్షిపణిని- ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించేందుకు వీలుగా రూపొందించారు. ఇందులో అత్యాధునిక గైడెన్స్, నేవిగేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. వీటి సాయంతో క్షిపణి తన లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించే సామర్థ్యం కలిగి ఉంటుంది.