హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి దీటుగా భారత నౌకాదళాన్ని బలోపేతం చేసేందుకు రూ.53,866 కోట్లతో 8 అత్యాధునిక యుద్ధ నౌకలను సమకూర్చనున్నారు. దీనికి సంబంధించి రెండు ప్రభుత్వ రంగ నౌకా నిర్మాణ సంస్థలు... గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్(జీఆర్‌ఎస్‌ఈ), గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్(జీఎస్‌ఎల్)తో రక్షణ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. అధునాతన క్షిపణులు, ఆయుధాలు, సెన్సర్ వ్యవస్థలతో కూడిన యుద్ధ నౌకలను ఈ సంస్థలు నిర్మించి భారత నావికాదళానికి అందిస్తాయి. తీర ప్రాంత పోరాటాలు, సముద్ర జలాల్లోని వాణిజ్య మార్గాల రక్షణలో ఈ యుద్ధ నౌకలు కీలకపాత్ర వహిస్తాయి.