జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌18 ప్రయోగం

జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌18 ప్రయోగం
  • భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌18 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగవేదిక నుంచి 2026, అక్టోబరు 30న నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్‌.. ఎన్‌వీఎస్‌-03 నేవిగేషన్‌ ఉపగ్రహాన్ని నిర్దేశిత భూస్థిర కక్ష్యలోకి చేర్చింది.

  • భారతదేశం సొంత నేవిగేషన్‌ వ్యవస్థ నావిక్‌ సేవలను మరింత బలోపేతం చేయడమే ఈ ప్రయోగ ప్రధాన ఉద్దేశం. సుమారు 2,250 కిలోల బరువున్న ఎన్‌వీఎస్‌-03 ఉపగ్రహంలో స్వదేశీ, విదేశీ పరిజ్ఞానాలతో రూపొందించిన అణు గడియారాలను ఏర్పాటుచేశారు. ఇప్పటికే ఎల్‌5, ఎస్‌ బ్యాండ్లతో పాటు ఎల్‌1 సంకేతాన్ని అందించనున్నారు. దీంతో నేవిగేషన్‌ సేవల సామర్థ్యం మరింత పెరగనుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram