భారతీయ అంతరిక్ష కేంద్రానికి రెండు రోబోటిక్‌ చేతులు

భారతీయ అంతరిక్ష కేంద్రానికి రెండు రోబోటిక్‌ చేతులు

ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న భారతీయ అంతరిక్ష కేంద్రాని (బీఏఎస్‌)కి రోబోటిక్‌ సామర్థ్యాన్ని జోడించనున్నారు. దీనివల్ల ఆ కేంద్రం వెలుపల కార్యకలాపాలను నిర్వహించడానికి వ్యోమగాములకు వీలు కలుగుతుంది. అలాగే దాని ఆకృతిని తనిఖీ చేయడానికి, భవిష్యత్‌లో విస్తరణ చేపట్టడానికి మార్గం సుగమమవుతుంది.

  • ఈ కేంద్రంలో అంతర్గత, వెలుపలి రోబోటిక్‌ హస్తాలు, స్వేచ్ఛగా విహరించే రోబోటిక్‌ వ్యవస్థలు, హ్యూమనాయిడ్‌ రోబోలు ఉంటాయి. నేల నుంచి 450 కిలోమీటర్ల ఎత్తులోని భూ దిగువ కక్ష్యలో ప్రవేశపెట్టనున్న ఈ అంతరిక్ష కేంద్రంలో అయిదు మాడ్యూల్స్‌ ఉంటాయి. వాటన్నింటికీ వ్యోమనౌకలు అనుసంధానం కావొచ్చు. అయిదు మాడ్యూళ్ల బరువు 54 టన్నులు. ఈ కేంద్రం పొడవు 27 మీటర్లు, వెడల్పు 20 మీటర్లు. ఇందులో ముగ్గురు- నలుగురు వ్యోమగాములు నిరంతరం నివసించొచ్చు. స్వల్పకాలం పాటు మరో ముగ్గురు ఉండొచ్చు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram