ముగిసిన స్పేడెక్స్‌ ఉపగ్రహాల ప్రస్థానం

ముగిసిన స్పేడెక్స్‌ ఉపగ్రహాల ప్రస్థానం

స్పేడెక్స్‌ ప్రయోగంలో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నింగిలోకి పంపిన రెండు ఉపగ్రహాలు తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశించాయి. దీంతో 22 నెలల వీటి ప్రస్థానం ముగిసినట్లయింది. రోదసిలో రెండు వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియపై కసరత్తు కోసం స్పేడెక్స్‌-ఎ, స్పేడెక్స్‌-బి అనే ఈ రెండు ఉపగ్రహాలను 2024 డిసెంబరు 30న ఇస్రో ప్రయోగించింది. ఆ తర్వాత వీటిని రోదసిలో స్వయంప్రతిపత్తి పరిజ్ఞానంతో అనుసంధానం చేసింది. అనంతరం వాటిని విడదీసింది. ఈ ప్రయోగానికి సంబంధించిన అన్ని లక్ష్యాలూ నెరవేరాయని ఇస్రో పేర్కొంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram