కొత్త గ్రహం

కొత్త గ్రహం

సాధారణంగా గ్రహాల వయసు కోట్ల సంవత్సరాల్లో ఉంటుంది. భూమి పుట్టి సుమారు 450 కోట్ల ఏళ్లయింది. అయితే తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించిన ఒక గ్రహం వయసు కేవలం 10 లక్షల ఏళ్లే. అంతరిక్ష ప్రమాణాల ప్రకారం చూస్తే అది నవజాత శిశువు కింద లెక్క. ఎలియస్‌ 2-24బి అనే ఈ గ్రహం మనకు 450 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇది సుమారు మన గురు గ్రహ పరిమాణంలో ఉంది. దీని జననానికి కారణమైన వాయు, ధూళి మేఘం నుంచి ఇది ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. దీంతో గ్రహాల ఆవిర్భావం గురించి అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలకు మంచి అవకాశం దక్కింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram