భారత్ దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్’లో జపాన్ వాయుసేనాధిపతి జనరల్ తకెహిరో మొరితా గగన విహారం చేశారు. రాజస్థాన్‌లోని జోధ్‌పుర్ వేదికగా వీర్ గార్డియన్ పేరుతో భారత్, జపాన్ వైమానిక దళాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న విన్యాసాల్లో 2026, సెప్టెంబరు 20న ఈ పరిణామం చోటుచేసుకుంది. ఆయన ప్రశంసించారు. భారత వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.పి.సింగ్ ఒంటరిగా మరో తేజస్‌లో ప్రయాణించారు.