డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ)తో కలిసి అధునాతన సాయుధ ప్లాట్‌ఫాం (ట్రాక్డ్ అండ్ వీల్డ్) అయిన విక్రమ్ వీటీ 21, 30 ఎమ్‌ఎమ్ అన్‌మాన్డ్ టరిట్‌ను అభివృద్ధి చేసినట్లు టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (టీఏఎస్‌ఎల్) వెల్లడించింది. వెహికల్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (వీఆర్‌డీఈ) డిజైన్, మద్దతుతో వీటి ప్రొటోటైపులను 30 నెలల రికార్డు సమయంలో పూర్తి చేసినట్లు టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ తెలిపింది.