ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి స్వచ్ఛ హైడ్రోజన్‌

ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి స్వచ్ఛ హైడ్రోజన్‌
  • ధన్‌బాద్‌ ఐఐటీ (ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌)లోని కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన పరిశోధకులు  ప్లాస్టిక్‌ వ్యర్థాలను స్వచ్ఛ హైడ్రోజన్‌ ఇంధనంగా మార్చగల పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. వీరు ప్లాస్మా రియాక్టర్‌ ఆధారిత సాంకేతికతను రూపొందించారు. ఇది ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించడంతోపాటు, హైడ్రోజన్‌ ఇంధనం, విలువైన ఇతర ఉప ఉత్పత్తులను అందిస్తుంది.
  • ప్లాస్మా రియాక్టర్‌ ఆధారిత సాంకేతికతతో ప్లాస్టిక్‌ వ్యర్థాలను ప్రాసెస్‌ చేసినప్పుడు కార్బన్‌ నానోట్యూబ్‌లు ఉప ఉత్పత్తులుగా వస్తాయి. కిలో రూ.లక్షకుపైగా ధర కలిగిన వీటిని బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, పలు మిశ్రమాల తయారీలో వినియోగిస్తారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram