సైనిక దళాల అవసరాలను తీర్చడానికి రూపొందించిన రెండు సాయుధ శకటాలను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) 2026, ఏప్రిల్ 25న ఆవిష్కరించింది. వీటిని వెహికిల్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ సంస్థ రూపొందించింది. ఇందులో ట్రాక్, చక్రాలతో నడిచేవి ఉన్నాయి. చురుకైన కదలికలు, కాల్పుల సామర్థ్యం, రక్షణ వంటి అంశాలకు వీటిలో పెద్దపీట వేసినట్లు రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది.