కృష్ణబిల ఉద్గారాల జోరు

కృష్ణబిల ఉద్గారాల జోరు
  • కృష్ణబిలం నుంచి వెలువడే శక్తి ఉద్గారాల వేగాన్ని తొలిసారిగా శాస్త్రవేత్తలు లెక్కించారు. అది గంటకు 54 కోట్ల కిలోమీటర్లుగా ఉందని తేల్చారు. ఇది కాంతి వేగంలో సగమని వారు చెప్పారు. భూమికి 7,200 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సిగ్నస్‌ ఎక్స్‌-1 అనే కృష్ణబిల-నక్షత్ర వ్యవస్థలోని ఈ ఉద్గారాల శక్తి 10వేల సూర్యుళ్లకు సమానమని వారు పేర్కొన్నారు.
  • ఈ వ్యవస్థలో కృష్ణబిలం మాత్రమే కాకుండా ఒక భారీ నక్షత్రం జతగా ఉంది. ఈ జంట.. పాలపుంత గెలాక్సీలోని సిగ్నస్‌ తారామండలంలో ఉంది. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన స్టీవ్‌ ప్రభు నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధన చేసింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram