మైథోస్‌

మైథోస్‌
  • అమెరికాకు చెందిన కృత్రిమ మేధ (ఏఐ) సంస్థ ఆంథ్రోపిక్‌ ఇటీవల ‘మైథోస్‌ మోడల్‌’ను ఆవిష్కరించింది. నిర్దిష్ట ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను దెబ్బతీసే శక్తి ఈ మోడల్‌కు ఉంది. కీలక జాతీయ భద్రతా సంస్థల్లోకి చొరబడటంతోపాటు దిగ్గజ కంపెనీలను సైతం కుప్పకూల్చే సత్తా మైథోస్‌ సొంతం. గట్టి నియంత్రణ లేకపోతే ఈ మోడల్‌ వల్ల సైబర్‌ భద్రతకు పెను సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
  • దీని తీరుతెన్నులు స్వయంగా ఆ సంస్థనే ఆందోళనలో ముంచెత్తింది. అందుకే ఆరంభంలో ఎంపిక చేసిన 40 కంపెనీలు, సంస్థలకు మాత్రమే దీన్ని ప్రయోగాత్మకంగా ఉపయోగించే అవకాశం కల్పించింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram