కాముకాజి ఆయుధం

కాముకాజి ఆయుధం
  • ఆధునిక సాంకేతిక యుద్ధాల్లో కీలకపాత్ర పోషించే ఆత్మాహుతి డ్రోన్లు ‘కాముకాజి’ భారత సైన్యం అమ్ములపొదిలోకి వచ్చాయి. 2025, ఏప్రిల్‌లో జరిగిన పహల్గాం ఘటన నేపథ్యంలో సరిహద్దుల రక్షణ విషయంలో భారత్‌ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. సాంకేతికతను అందిపుచ్చుకొంటూ ప్రాణనష్టం జరగకుండా.. శత్రుమూకల్ని అంతం చేసేందుకు వీలుగా ఆత్మాహుతి డ్రోన్లను సమకూర్చుకుంటోంది. ఈ క్రమంలోనే 2025, డిసెంబరులో కేంద్ర రక్షణశాఖ పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ‘ఇన్‌సైడ్‌ ఎఫ్‌పీవీ’ అనే సంస్థ వందలాది ఆత్మాహుతి డ్రోన్లను ఆర్మీ నార్తర్న్‌ కమాండ్‌కు తాజాగా చేరవేసింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram