ఆర్టెమిస్‌-2 రికార్డు

ఆర్టెమిస్‌-2 రికార్డు
  • చంద్రుడిని చుట్టి వచ్చేందుకు ఏప్రిల్‌ 1న నలుగురు వ్యోమగాములతో అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా చేపట్టిన ఆర్టెమిస్‌-2 యాత్ర 2026, ఏప్రిల్‌ 6న మానవాళి చరిత్రలో సరికొత్త రికార్డును స్థాపించింది. భూమి నుంచి అత్యధిక దూరం ప్రయాణించిన మనుషులుగా వీరు చరిత్ర సృష్టించారు. 1970 ఏప్రిల్‌ 13న అపోలో-13 వ్యోమగాముల పేరిట ఉన్న రికార్డును వారు చెరిపేశారు. నాడు ఆ యాత్రికులు భూమి నుంచి 4,00,171 కిలోమీటర్ల దూరం పయనించారు. ఆర్టెమిస్‌-2 వ్యోమగాములు అంతకన్నా దాదాపు 6,600 కిలోమీటర్ల దూరం ఎక్కువగా ప్రయాణించవచ్చని నాసా తొలి అంచనాలు చెబుతున్నాయి. 
  • రీడ్‌ వైస్‌మాన్, విక్టర్‌ గ్లోవర్, క్రిస్టీనా కోచ్, జెరెమీ హాన్సన్‌ ఈ మిషన్‌లో భాగంగా నింగిలోకి వెళ్లారు. వీరు మానవుడికి నేరుగా కనిపించని చంద్రుని రెండోవైపు అద్భుతమైన దృశ్యాలను ఒరాయన్‌ వ్యోమనౌక నుంచి వీక్షించారు. అక్కడి నుంచి వ్యోమనౌక.. యూ టర్న్‌ తీసుకొని భూమి వైపునకు దూసుకొస్తుంది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram