తారాగిరి

తారాగిరి
  • రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ 2026, ఏప్రిల్‌ 3న విశాఖలోని తూర్పు నౌకాదళ ముఖ్యకేంద్రంలో ‘సముద్రశక్తి నౌక’గా నిర్మితమైన ‘ఐఎన్‌ఎస్‌ తారాగిరి’ని జాతికి అంకితం (కమిషన్‌) చేశారు. దీని నిర్మాణంలో 75% స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. ఇందులో బ్రహ్మోస్‌తో కలిపి అత్యాధునిక రాడార్, సోనార్, మిసైల్‌ వ్యవస్థలున్నాయి. ‘ప్రపంచంలోని పరిస్థితుల నేపథ్యంలో భారత నౌకాదళం హిందూ మహాసముద్ర ప్రాంతమంతా నిరంతరం పహరా కాస్తోంది. దేశంలోని వాణిజ్యంలో 95%, ముఖ్యంగా ఇంధన రవాణా సముద్రమార్గంలోనే జరుగుతోంది. దేశ రక్షణతో పాటు సముద్ర వాణిజ్యం ఎదుర్కొంటున్న భద్రతాపరమైన సవాళ్లను అధిగమించడానికి నేవీ బహుముఖంగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఉద్రిక్తతలు పెరిగినప్పుడల్లా వాణిజ్య నౌకలు, ఆయిల్‌ ట్యాంకర్లకు భద్రత ఇచ్చేందుకు నౌకాదళం రంగంలోకి దిగుతోంది. వాణిజ్య మార్గాలను రక్షించడానికి అవసరమైన ప్రతిచర్య తీసుకోవడానికీ సిద్ధంగా ఉంది’ అని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram