సబ్‌మెర్సిబుల్‌

సబ్‌మెర్సిబుల్‌
  • నీటి అడుగున ప్రయాణించడానికి యూ-బోట్‌ అనే డచ్‌ కంపెనీ సబ్‌మెర్సిబుల్‌ (మినీ జలాంతర్గామి)ను నిర్మించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సబ్‌మెర్సిబుల్‌ (మినీ జలాంతర్గామి)గా గుర్తింపు పొందింది. సాగర గర్భంలోని అద్భుతాలను వీక్షించడానికి, పగడపు దిబ్బలు లాంటి సహజసిద్ధ వ్యవస్థలను పర్యవేక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది. దీని ధర 57.5 లక్షల డాలర్లు. దీన్ని ‘అండర్‌వాటర్‌ సూపర్‌ కారు’గా అభివర్ణిస్తున్నారు.
  • దీని పొడవు 6.5 మీటర్లు, వెడల్పు 3.27 మీటర్లు. బ్యాటరీ సామర్థ్యం 62 కిలోవాట్‌ అవర్‌ (ఏకబిగిన 8 గంటల పాటు శక్తిని అందించగలదు). 
  • చోదక వ్యవస్థ: 25 కిలోవాట్ల సామర్థ్యమున్న నాలుగు, 6 కిలోవాట్ల సామర్థ్యమున్న రెండు మోటర్లు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram