శాన్‌ఫ్రాన్సిస్కో డిక్లరేషన్‌

శాన్‌ఫ్రాన్సిస్కో డిక్లరేషన్‌
  • కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో పోటీ నానాటికీ తీవ్రమవుతున్న వేళ భారత్‌ కీలక ముందడుగు వేసింది. ఏఐ సరఫరా గొలుసుల రక్షణ కోసం అమెరికా సహా మరో 8 దేశాలతో కలిసి ‘శాన్‌ఫ్రాన్సిస్కో డిక్లరేషన్‌’పై సంతకం చేసింది. ఏఐ రంగంలో సరఫరా గొలుసుల కోసం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు అమెరికా నేతృత్వంలో మొదలైన పాక్స్‌ సిలికా ఇనీషియేటివ్‌ సమావేశం అమెరికా విదేశాంగ శాఖ ఆర్థిక వ్యవహారాల అండర్‌ సెక్రటరీ జాకబ్‌ హెల్‌బర్గ్‌ అధ్యక్షతన జరిగింది.

  • ఈ భేటీలోనే శాన్‌ఫ్రాన్సిస్కో డిక్లరేషన్‌పై భారత్, అమెరికాలతో పాటు జపాన్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, బ్రిటన్, దక్షిణ కొరియా, ఖతార్, యూఏఈ, సింగపూర్‌ సంతకాలు చేశాయి. జర్మనీ, ఐరోపా సమాఖ్య, నెదర్లాండ్స్, స్వీడన్‌ కూడా త్వరలో వీటితో చేతులు కలపనున్నాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram