తాంపా నౌక

 తాంపా నౌక
  • మొదటి ప్రపంచ యుద్ధం నాటి ‘తాంపా నౌక’ శిథిలాలు 107 ఏళ్ల తర్వాత లభ్యమయ్యాయి. బ్రిటన్‌లోని కార్న్‌వాల్‌ తీరానికి 80 కిలోమీటర్ల దూరంలో.. అట్లాంటిక్‌ సముద్రం అడుగున 300 అడుగుల లోతులో బ్రిటిష్‌ గజ ఈతగాళ్లు ఈ నౌక శిథిలాలు గుర్తించారు. 
  • మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో 1918 సెప్టెంబరు 17న అమెరికా కోస్ట్‌గార్డ్‌ కట్టర్‌ నౌక ‘తాంపా’ అట్లాంటిక్‌ జలాల్లో ప్రయాణం ప్రారంభించింది. నౌక బాయిలర్లకు శక్తిని అందించే బొగ్గు 26వ తేదీ నాటికి దాదాపు అయిపోవచ్చింది. బొగ్గును మళ్లీ నింపుకోవడం కోసం నౌకను కాన్వాయ్‌ నుంచి బయటికి తీసుకువెళతానని కెప్టెన్‌ ఉన్నతాధికారులకు విజ్ఞప్తిచేశారు. అందుకు కమాండర్లు అనుమతించడంతో నౌకను వేల్స్‌లోని ఒక రేవు వైపు కెప్టెన్‌ వేగంగా నడుపుతున్నారు. దాన్ని అదేరోజు రాత్రి జర్మనీ జలాంతర్గామి యూబీ-41 గమనించింది. జలాంతర్గామి కెప్టెన్‌ టార్పెడోతో పేల్చివేతకు మీట నొక్కారు. ఈ పేలుడుకు తోడు, బొగ్గు ధూళి కూడా మండటంతో నౌక మునిగింది. అందులోని 131 మంది సైనికులు, సిబ్బంది నీట ముగినిపోయారు.
  • మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికాకు జరిగిన అతిపెద్ద నౌకాదళ నష్టం ఇది. నౌక శిథిలాల కోసం అన్వేషణ బృందాలు శోధిస్తూనే ఉన్నాయి. ఆ కృషి ఇప్పటికి ఫలించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram