రాష్ట్రంలో జల కాలుష్య నియంత్రణకు నూతన చట్టం

రాష్ట్రంలో జల కాలుష్య నియంత్రణకు నూతన చట్టం

జల కాలుష్య నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వాటర్‌ (ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ ఆఫ్‌ పొల్యూషన్‌) అమెండ్‌మెంట్‌ యాక్ట్‌-2024ను తెలంగాణలో అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2026, నవంబరు 5న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ఈ చట్టం అమల్లోకి వస్తే జల కాలుష్యానికి సంబంధించి చిన్నపాటి తప్పులను నేరాలుగా నమోదు చేసే విధానం ఉండదు. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నుంచి పరిశ్రమలు తీసుకోవాల్సిన అనుమతుల ప్రక్రియ కూడా సులభం కానుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

  • కేంద్ర సవరణ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయడంపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన 2026, మే 15న మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఉపసంఘం ప్రతిపాదనలను పరిశీలించాక రాష్ట్ర మంత్రివర్గం తాజా నిర్ణయాన్ని తీసుకుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram