జిల్లా కోర్టుల్లో న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు పెంపు

జిల్లా కోర్టుల్లో న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు పెంపు

తెలంగాణలో జిల్లా కోర్టుల్లోని అన్ని స్థాయుల న్యాయమూర్తుల పదవీ విరమణ వయసును 61 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా ఆదేశాల మేరకు.. చట్ట సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ న్యాయశాఖ కార్యదర్శి బి.పాపిరెడ్డి ఆర్డినెన్స్‌ జారీ చేశారు. ఈ నిర్ణయం 2026 మార్చి 31 నుంచే అమల్లోకి వచ్చినట్లు ఆర్డినెన్స్‌లో స్పష్టం చేశారు.

  • 2021లో చేసిన చట్ట సవరణ ద్వారా న్యాయాధికారుల పదవీ విరమణ వయసును 60 నుంచి 61 ఏళ్లకు పెంచారు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు, తెలంగాణ హైకోర్టు సిఫార్సుల నేపథ్యంలో వయఃపరిమితిని మరో ఏడాది పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram