వ్యవసాయ యాంత్రీకరణ పథకం

వ్యవసాయ యాంత్రీకరణ పథకం

తెలంగాణలో రూ.147.99 కోట్లతో వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలుకు మార్గం సుగమమైంది. 2026-27 ఆర్థిక సంవత్సరం కింద కేంద్ర ప్రభుత్వం ఈ పథకం అమలుకు అనుమతినివ్వగా.. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 2026, అక్టోబరు 27న మార్గదర్శకాలు జారీ చేసింది. రైతులకు వ్యక్తిగతంగానే గాక తొలిసారి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, మహిళా సంఘాలకు సైతం యంత్ర పరికరాలను పంపిణీ చేయనున్నారు. కస్టమ్స్‌ హైరింగ్‌ కేంద్రాల ఏర్పాటు కోసం ఒక్కో సంఘానికి రూ.50 లక్షల విలువైన పరికరాలను ప్రభుత్వం అందజేస్తుంది. అందులో 40% వరకు సబ్సిడీ ఉంటుంది. మిగిలిన 60% సొమ్మును సంఘాలు భరించాల్సి ఉంటుంది. ఈ సంఘాలు ఏర్పాటు చేసే కస్టమ్స్‌ హైరింగ్‌ కేంద్రాల నుంచి రైతులు తమకు కావాల్సిన యంత్ర పరికరాలను అద్దెకు తీసుకుని వినియోగించుకోవచ్చు. వ్యక్తిగత లబ్ధిదారుల్లో ఎస్సీ, ఎస్టీ, మహిళ, చిన్న, సన్నకారు రైతులకు 50% సబ్సిడీ ఇస్తారు. ట్రాక్టర్‌ మౌంటెడ్‌ బూమ్‌ స్ప్రేయర్, కిసాన్‌ డ్రోన్‌లు, రొటవేటర్లు, హార్వెస్టర్లు, తదితరాలతో కలిపి మొత్తం 37 రకాల పరికరాలను పంపిణీ జాబితాలో చేర్చారు

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram