నూతన డీజీపీగా సీవీ ఆనంద్‌

నూతన డీజీపీగా సీవీ ఆనంద్‌
  • తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్‌ను ఎంపిక చేస్తూ ప్రభుత్వం 2026, ఏప్రిల్‌ 28న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి ఏప్రిల్‌ 30న పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఆయన స్థానంలో ఆనంద్‌ మే 1న బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆనంద్‌ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు.
  • సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు యూపీఎస్సీ ద్వారా ఎంపికైన ఆనంద్‌ రెండేళ్లపాటు ఆ పోస్టులో కొనసాగనున్నారు. 22 ఏళ్ల వయసులో, మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్‌కు ఎంపికైన ఆనంద్‌ 34 ఏళ్లపాటు ఉమ్మడి రాష్ట్రం, తెలంగాణలో అనేక విభాగాల్లో సుదీర్ఘ సేవలు అందించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram