ఉద్యోగ గణాంకాలు

ఉద్యోగ గణాంకాలు
  • తెలంగాణవ్యాప్తంగా గడిచిన అయిదేళ్లలో కొత్తగా 12.59లక్షల మంది ఉద్యోగ విపణిలోకి వచ్చినట్లు సామాజిక భద్రత గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈపీఎఫ్‌వో వద్ద నమోదైన పీఎంవీబీఆర్‌వై(ప్రధాన మంత్రి వికసిత్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన) గణాంకాల ప్రకారం గడిచిన ఎనిమిది నెలల్లోనే దాదాపు 3.12 లక్షల మంది తొలిసారి ఉద్యోగాల్లో చేరినట్లు వెల్లడైంది. అధిక నైపుణ్య ఉద్యోగాలతోపాటు మధ్యస్థాయి కొలువులు గణనీయంగా పెరిగాయి. 
  • ఈపీఎఫ్‌వో గణాంకాలు పరిశీలిస్తే రాష్ట్రవ్యాప్తంగా 55.42లక్షల మంది పనిచేస్తున్నట్లు వెల్లడైంది. సంఘటిత రంగంలోని ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 31.39 లక్షల మంది పనిచేస్తుంటే, గడిచిన ఐదేళ్లలో దాదాపు 7.23 లక్షల మంది కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram