నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్‌ యూజీ) 2026

నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్‌ యూజీ) 2026

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) యూజీ (నీట్‌ యూజీ 2026) పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు.

వివరాలు:

నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్‌ యూజీ) 2026

అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/ బయోటెక్నాలజీతో సైన్స్‌లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 17 ఏళ్లు నిండి ఉండాలి.

పరీక్ష వ్యవధి: 180 నిమిషాలు (3 గంటలు).

దరఖాస్తు రుసుము: జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు రూ.1700 కాగా, జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ-ఎన్‌సీఎల్‌ అభ్యర్థులకు రూ.1600, ఎస్సీ, ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ థర్డ్‌ జండర్‌ అభ్యర్థులకు రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇతర దేశాలకు చెందిన అభ్యర్థులైతే దరఖాస్తు రుసుం రూ.9500లుగా నిర్ణయించారు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 08.03.2026. 

నీట్ పరీక్ష తేదీ: మే 4న మధ్యాహ్నం 2గంటల నుంచి 5 గంటల వరకు జరగనుంది. 

Website:https://neet.ntaonline.in/

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram