ఏపీ రిసెర్చ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏపీఆర్‌సెట్‌)-2025-26

ఏపీ రిసెర్చ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏపీఆర్‌సెట్‌)-2025-26

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాల్లో పరిశోధనా కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థుల కోసం ఏపీ రిసెర్చ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏపీఆర్‌సెట్‌)-2025-26 ప్రకటన వెలువడింది. ప్రవేశ పరీక్ష ద్వారా ఏపీలోని వర్సిటీలు, రిసెర్చ్‌ సెంటర్స్, అనుబంధ కళాశాలల్లో పీహెచ్‌డీ(ఫుల్‌ టైమ్‌/ పార్ట్‌ టైమ్‌) ప్రోగ్రాముల్లో ప్రవేశాలు పొందవచ్చు.

వివరాలు:

ఏపీ రిసెర్చ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏపీఆర్‌సెట్‌)-2025-26

విభాగాలు: సైన్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్స్, ఫైన్ ఆర్ట్స్, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ & ప్లానింగ్, లా అండ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ తదితరాలు.

అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో ఇంజినీరింగ్ విభాగాలలో పీహెచ్‌డీ. ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీని(ఎం.టెక్.) కలిగి ఉండాలి.
సైన్స్ విభాగాలలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ (ఎం.ఎస్.సి.) కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: ఆర్‌సెట్‌ అనేది కంప్యూటర్ ఆధారిత పరీక్ష 140 మార్కులకు ఉంటుంది. ఇది బహుళైచ్ఛిక ప్రశ్నల (MCQ) పరీక్ష. ఇందులో సెక్షన్-ఏ (రిసెర్చ్ మెథడాలజీ - 70 మార్కులు), సెక్షన్-బి(సంబంధిత సబ్జెక్టు - 70 మార్కులు) ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. నెగెటివ్ మార్కులు లేవు. పరీక్షలో జనరల్‌ అభ్యర్థులు 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులు 45శాతం మార్కులు సాధిస్తే ఇంటర్వ్యూకు అర్హులవుతారు.

పరీక్ష కేంద్రాలు: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, భీమవరం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం, హైదరాబాద్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తులు ప్రారంభం: 19-11-2026

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తులకు చివరి తేదీ: 15-01-2027

రూ.2000 ఆలస్య రుసుము, రిజిస్ట్రేషన్ ఫీజు తో దరఖాస్తు తేదీలు: 16-01-2027 నుంచి 16-01-2027

ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ తేదీలు: 22-01-2027 నుంచి 27-01-2027 వరకు.

హాల్-టికెట్ల డౌన్‌లోడ్: 29-01-2027 నుంచి 02-02-2027.

పరీక్ష తేదీలు: 08-02-2027 నుంచి 11-02-2027.

ప్రాథమిక కీ విడుదల: 19-02-2027.

కీ పై అభ్యంతరాలకు చివరి తేదీ: 21.02.2027

ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల ప్రకటన: 09.03.2027

ఇంటర్వ్యూ తేదీలు: 16.03.2027 - 20-03-2027

ర్యాంకు కార్డు విడుదల: 31-03-2027

Website:https://cets.apsche.ap.gov.in/RCET/RCET/RCET_HomePage

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram