జేఎన్‌ఏఎఫ్‌ఏయూ, హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు

జేఎన్‌ఏఎఫ్‌ఏయూ, హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు

జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ), హైదరాబాద్ 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఫుల్‌టైం/ పార్ట్-టైమ్ పీహెచ్‌డీ రిసెర్చ్ ప్రోగ్రామ్‌లు క్రింది విభాగాలలో ప్రవేశాలు కల్పించనున్నారు.

వివరాలు:

ఆర్కిటెక్చర్: 6 సీట్లు

అర్బన్ అండ్ రీజినల్ ప్లానింగ్: 2 సీట్లు

పెయింటింగ్: 3 సీట్లు

అర్హత: అభ్యర్థులు కనీసం 55% మార్కులతో (లేదా తత్సమాన గ్రేడ్‌తో) సంబంధిత మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) అభ్యర్థులకు 5% మార్కుల సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఏ4 సైజులో, అవసరమైన అన్ని ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలతో పాటు సమర్పించాలి. రూ.2,000/- (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ. 1,000) డిమాండ్ డ్రాఫ్ట్ (DD) జత చేయాలి. పూర్తి చేసిన దరఖాస్తులను స్వయంగా లేదా రిజిస్టర్డ్ పోస్ట్/కొరియర్ ద్వారా ది డైరెక్టర్‌, అడ్మిషన్స్‌, జేఎన్‌ఏఎఫ్‌ఏ యూనివర్సిటీ, మాసబ్‌ట్యాంక్‌, హైదరాబాద్‌ కార్యాలయానికి పంపాలి.

దరఖాస్తు చివరి తేదీ: 30.11.2026

ఆలస్య రుసుము రూ.1000తో చివరి తేదీ: 05.12.2026.

Website:https://jnafau.ac.in/notification/ph-d-admissions-2026/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram