సైనిక్‌ స్కూల్స్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌-2027 - 6, 9 తరగతుల్లో ప్రవేశాలు

సైనిక్‌ స్కూల్స్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌-2027 - 6, 9 తరగతుల్లో ప్రవేశాలు

త్రివిధ దళాలకు అవసరమైన అధికారులను పాఠశాల విద్య నుంచే సిద్ధం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. వచ్చే విద్యా సంవత్సరం(2027-28)లో ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలకు ఆలిండియా సైనిక్‌ స్కూల్స్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఏఐఎస్‌ఎస్‌ఈఈ 2027) కోసం అర్హులైన విద్యార్థుల నుంచి ఎన్‌టీఏ దరఖాస్తులను కోరుతోంది.

వివరాలు:

  • ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (AISSEE) - 2027

ప్రవేశ తరగతులు:

6వ, 9వ తరగతుల్లో ప్రవేశం (ప్రస్తుత సైనిక్ స్కూల్స్ & ఆమోదించిన కొత్త సైనిక్ స్కూల్స్)

అర్హత: ఆరోతరగతికి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు 2027 మార్చి 31 నాటికి 10 నుంచి 12 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి.(అంటే 01 ఏప్రిల్ 2015, 31 మార్చి 2017 మధ్య జన్మించి ఉండాలి). బాలికలకు సైతం ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి. సీట్ల లభ్యత, వయస్సు ప్రమాణాలు ఇద్దరికీ ఒకేలా ఉంటాయి. అలాగే, తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు మార్చి 31, 2027 నాటికి అభ్యర్థుల వయోపరిమితి 13 నుంచి 15 ఏళ్లు మధ్య ఉండాలి. ఎనిమిదో తరగతి పాసై ఉండాలి.

  • ఆసక్తి కలిగిన విద్యార్థులు డిసెంబరు 2 వరకు ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కూళ్లన్నీ సీబీఎస్‌ఈ అనుబంధ ఇంగ్లిష్‌ మీడియం రెసిడెన్షియల్‌ పాఠశాలలే. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, ఇండియన్‌ నేవీ అకాడమీ, ఇతర శిక్షణా అకాడమీలకు ఇక్కడ క్యాడెట్లను సిద్ధం చేస్తారు.

పరీక్ష విధానం:

పరీక్ష పెన్ను, పేపర్‌ (OMR షీట్‌) విధానంలో ఉంటుంది. మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలే (MCQ) ఉంటాయి.

ఆరో తరగతికి పరీక్ష మాధ్యమం: తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ సహా 13 భాషల్లో ఉంటుంది.
9వ తరగతికి కేవలం ఇంగ్లిష్‌ మాధ్యమంలోనే పరీక్ష ఉంటుంది.

ఆరోతరగతికి సబ్జెక్టుల వారీగా మార్కులు ఇలా: లాంగ్వేజ్‌ 25 ప్రశ్నలకు 50 మార్కులు; మ్యాథమెటిక్స్‌ 50 ప్రశ్నలకు 150 మార్కులు; ఇంటెలిజెన్స్‌ 25 ప్రశ్నలకు 50 మార్కులు; జనరల్‌ నాలెడ్జ్‌ 25 ప్రశ్నలకు 50 మార్కులు చొప్పున మొత్తంగా 125 ప్రశ్నలకు 300 మార్కులకు పరీక్ష ఉంటుంది.

తొమ్మిదో తరగతికి సబ్జెక్టుల వారీగా మార్కులు ఇలా..: మ్యాథమెటిక్స్‌ 50 ప్రశ్నలకు 200 మార్కులు; ఇంటెలిజెన్స్‌ 25 ప్రశ్నలకు 50 మార్కులు; ఇంగ్లిష్‌ 25 ప్రశ్నలకు 50 మార్కులు; జనరల్‌ సైన్స్‌ 25 ప్రశ్నలకు 50 మార్కులు; సోషల్‌ సైన్స్‌ 25 ప్రశ్నలకు 50 మార్కులు చొప్పున మొత్తంగా 150 ప్రశ్నలకు 400 మార్కులకు పరీక్ష ఉంటుంది.

పరీక్ష సమయం: ఆరో తరగతి విద్యార్థులకు (మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు) 150 నిమిషాలు; తొమ్మిదో తరగతి విద్యార్థులకు (మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు) 180 నిమిషాల చొప్పున ఉంటుంది.

దరఖాస్తు రుసుం: జనరల్‌/రక్షణ రంగంలో పనిచేస్తున్నవారి పిల్లలు, ఓబీసీలు (నాన్‌ క్రిమీలేయర్‌), ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ పిల్లలకు రూ.850; ఎస్సీ/ఎస్టీలకు రూ.700.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే: అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం; తెలంగాణలో హైదరాబాద్‌, కరీంనగర్‌.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 02.12.2026

దరఖాస్తు రుసుం చెల్లింపునకు చివరి తేదీ: 02.12.2026

రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తు గడువు: 03.12.2026- 06.12.2026

దరఖాస్తు సవరణ తేదీ: డిసెంబరు 7 నుంచి 9 వరకు.

అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌: 25.01.2027

పరీక్ష తేదీ: 31.01.2027

Website: https://exams.nta.nic.in/sainik-school-society/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram