జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)-సెషన్‌-1 2027

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)-సెషన్‌-1 2027

దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చర్‌, ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (JEE Main)-2027 సెషన్‌-1 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఎన్‌ఐటీలు (NITs), ఐఐఐటీలు (IIITs), కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సాంకేతిక విద్యాసంస్థలు (CFTIs), ఇతర భాగస్వామ్య సంస్థల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.

వివరాలు:

  • జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) సెషన్‌-1-2027

అర్హత: జేఈఈ మెయిన్‌-2027 పరీక్షకు ఇంటర్మీడియట్‌ (10+2) లేదా తత్సమాన పరీక్షలో 2025, 2026 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైనవారు, 2027లో పరీక్షలకు హాజరవుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈ/బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఫిజిక్స్‌, మ్యాథమెటిక్స్‌తో పాటు నిర్దేశిత సబ్జెక్టులు చదివి ఉండాలి. బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సులకు ఆయా కోర్సుల ప్రవేశ అర్హతలను కలిగి ఉండాలి.

జేఈఈ మెయిన్స్‌ ఎందుకంటే?

  • దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో బీటెక్‌ సీట్లను జేఈఈ మెయిన్‌ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. ఐఐటీల్లో బీటెక్‌లో చేరాలంటే మెయిన్‌లో ఉత్తీర్ణులైన వారు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయాలి. జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించి అర్హత పొందిన 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అర్హత ఉంటుంది. జేఈఈ మెయిన్‌ ర్యాంకుల ఆధారంగా కొన్ని ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలు యాజమాన్య కోటా సీట్లను కేటాయిస్తాయి. దేశవ్యాప్తంగా 23 ఐఐటీల్లో 18వేలకు పైగా, 31 ఎన్‌ఐటీల్లో 25 వేలకు పైగా సీట్లున్నాయి. ఎన్‌ఐటీల్లో 50 శాతం సీట్లు సొంత రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారు.

  • పరీక్షలను తెలుగు, ఆంగ్లం సహా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆంగ్లంతో పాటు అభ్యర్థులు కోరుకున్న ప్రాంతీయ భాషలో కూడా ఇస్తారు. పేపర్‌-1 300, పేపర్‌-2(ఏ,బి) 400 మార్కులకు ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:
తెలంగాణ: ఆదిలాబాద్, హైదరాబాద్‌/సికింద్రాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, నల్గొండ, నిజామాబాద్‌, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్‌, జగిత్యాల.
ఏపీ: అనంతపురం, అమలాపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లి, మర్కాపుర్‌, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, పొద్దుటూరు, పుట్టూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, మచిలీపట్నం, తాడేపల్లిగూడెం.

పరీక్షల షెడ్యూల్‌...

తొలి విడత

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులు: అక్టోబర్‌ 24 నుంచి నవంబరు 22 వరకు.

  • దరఖాస్తుల సవరణ: నవంబరు 27 నుంచి 29.

  • సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు విడుదల: 30 డిసెంబరు.

  • హాల్‌టికెట్లు: 13.01.2027.

  • పరీక్షలు: జనవరి 22- జనవరి 28 మధ్య.
    రెండో విడత

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జనవరి 05 - ఫిబ్రవరి 03 వరకు.

  • సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు విడుదల: 12 మార్చి.

  • హాల్‌టికెట్లు: 25 మార్చి.

  • పరీక్షలు: ఏప్రిల్‌ 2- 7 మధ్య.

Website:https://jeemain.nta.nic.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram