రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్‌ (ఆర్‌ఐఎంసీ)లో 8వ తరగతి ప్రవేశాలు

రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్‌ (ఆర్‌ఐఎంసీ)లో 8వ తరగతి ప్రవేశాలు

రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్‌ (ఆర్‌ఐఎంసీ), డెహ్రాడూన్‌లో 2027 జులై టర్మ్‌కు 8వ తరగతి ప్రవేశాల కోసం ఆర్‌ఐఎంసీ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌-2026 (RIMCEE-2026) నిర్వహిస్తున్నారు. మొదటి దశ ప్రవేశ ప్రక్రియను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించనుండగా, వైవావోస్‌, వైద్య పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా మెరిట్‌ ఆధారిత తుది ధ్రువీకరణకు ఆర్‌ఐఎంసీ బాధ్యత వహిస్తుంది.

వివరాలు:

  • ఆర్‌ఐఎంసీ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌-2026 (RIMCEE-2026)- 8వ తరగతి ప్రవేశాలు

అర్హత: గుర్తింపు పొందిన పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న లేదా 7వ తరగతి ఉత్తీర్ణులైన బాలురు, బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్‌ఐఎంసీఈఈ-2026 ద్వారా జులై 2027 టర్మ్‌లో 8వ తరగతిలో ప్రవేశం ఉంటుంది.

వయోపరిమితి: 2027 జులై 1 నాటికి 12½ నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. 02-07-2013 నుంచి 01-01-2015 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు విధానం: దరఖాస్తును ఆన్‌లైన్‌లో మాత్రమే ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా సమర్పించాలి. రిజిస్ట్రేషన్‌ తర్వాత అప్లికేషన్‌ వివరాలు నమోదు చేసి, ఫొటో, జనన ధ్రువీకరణ పత్రం, డొమిసైల్‌ సర్టిఫికెట్‌, అవసరమైతే ఎస్సీ/ఎస్టీ సర్టిఫికెట్‌, స్కూల్‌ స్టడీయింగ్‌ సర్టిఫికెట్‌, ఎడమ చేతి బొటనవేలు ముద్ర తదితరాలను అప్‌లోడ్‌ చేయాలి. అనంతరం పరీక్ష ఫీజు చెల్లించి కన్ఫర్మేషన్‌ పేజ్‌ జనరేట్‌ చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్ / డిఫెన్స్‌ సిబ్బంది వార్డులు / ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ వార్డులు / ఓబీసీ-ఎన్‌సీఎల్‌ రూ.1,000; ఎస్సీ/ఎస్టీలకు రూ.750.

పరీక్ష కేంద్రాలు:

దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. అభ్యర్థులు అప్లికేషన్‌లో తమకు అనుకూలమైన పరీక్ష నగరాలను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవచ్చు. తెలంగాణకు హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌కు విజయవాడ, మహారాష్ట్రకు పుణె పరీక్ష నగరాలుగా జాబితాలో ఉన్నాయి. అయితే సాంకేతిక, లాజిస్టిక్‌ కారణాలతో అభ్యర్థి ఎంపిక చేసిన నగరానికి బదులుగా మరో నగరంలో కేంద్రం కేటాయించే అవకాశం ఉంది. తుది కేంద్రం వివరాలు అడ్మిట్‌ కార్డులో ఉంటాయి.

ఎంపిక విధానం:

రాత పరీక్ష, వివా వోస్‌, వైద్య పరీక్ష, తుది మెరిట్‌/అడ్మిషన్. వంటి దశల్లో విడివిడిగా అర్హత సాధించడం తప్పనిసరి. బాలురకు రాష్ట్రాల వారీగా, బాలికలకు జోన్ల వారీగా మెరిట్‌ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. అడ్మిషన్‌ మెరిట్‌ ఆధారంగానే జరుగుతుంది. రిజర్వేషన్‌ విధానం లేదని పెర్కొన్నారు.

ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01.09.2026

దరఖాస్తుకు చివరి తేదీ: 30.09.2026 సాయంత్రం 5 గంటల వరకు

ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 30.09.2026, రాత్రి 11:50 వరకు

ఆలస్య రుసుముతో దరఖాస్తు: 01.10.2026 నుంచి 07.10.2026 వరకు

కరెక్షన్‌ విండో: అక్టోబరు 09 నుంచి 11 వరకు

రాత పరీక్ష: 06.12.2026

స్టేజ్‌-I ఫలితాలు: 20.02.2027లోపు

వివా వోస్‌: ఏప్రిల్ 2027లో (తాత్కాలికం)

Website: https://examinationservices.nic.in/ExamSys26Part2/Root/Home.aspx?enc=Ei4cajBkK1gZSfgr53ImFQBut9oTMxhETt9bNm6zcP2ghS+a59eor30/A5h2io4z

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram