గేట్‌ 2027 నోటిఫికేషన్‌

గేట్‌ 2027 నోటిఫికేషన్‌

దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో వచ్చే ఏడాది ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌ 2027) పరీక్ష నోటిఫికేషన్‌ విడుదలైంది. కొత్తగా రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమేషన్‌ పేపర్‌ చేరింది. అలాగే ఒక పేపర్‌గా ఉన్న టెక్స్‌టైల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ఫైబర్‌ సైన్స్‌ను ఇంజినీరింగ్‌ సైన్సెస్‌లో ఒక సెక్షనగా చేర్చారు. అంటే కొత్తగా రోబోటిక్స్‌ పేపర్‌ను అదనంగా చేసినా.. మొత్తం పేపర్ల సంఖ్య గతేడాది మాదిరిగానే 30గా ఉంటుంది. గేట్‌ స్కోర్‌ను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు సైతం పరిగణనలోకి తీసుకుంటారు. గేట్‌ 2027 స్కోర్ ఫలితాల ప్రకటన తేదీ నుంచి 3 సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది.

వివరాలు:

  • గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ 2027

గేట్‌ 2027లో అందుబాటులో ఉన్న విభాగాలు:

ఏరోస్పేస్ ఇంజినీరింగ్ (AE), అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ (AG), ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ (AR), బయోమెడికల్ ఇంజినీరింగ్ (BM), బయోటెక్నాలజీ (BT), సివిల్ ఇంజినీరింగ్ (CE), కెమికల్ ఇంజినీరింగ్ (CH), కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (CS), కెమిస్ట్రీ (CY), డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (DA), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (EC), ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ (EE), ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ & ఇంజినీరింగ్ (ES), ఎకాలజీ అండ్ ఎవల్యూషన్ (EY), జియోమాటిక్స్ ఇంజినీరింగ్ (GE), జియాలజీ అండ్ జియోఫిజిక్స్ (GG), ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ (IN), మ్యాథమెటిక్స్ (MA), మెకానికల్ ఇంజినీరింగ్ (ME), మైనింగ్ ఇంజినీరింగ్ (MN), మెటలర్జికల్ ఇంజినీరింగ్ (MT), నేవల్ ఆర్కిటెక్చర్ & మెరైన్ ఇంజినీరింగ్ (NM), పెట్రోలియం ఇంజినీరింగ్ (PE), ఫిజిక్స్ (PH), ప్రొడక్షన్ & ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ (PI), రోబోటిక్స్ & ఆటోమేషన్ (RA), స్టాటిస్టిక్స్ (ST), ఇంజినీరింగ్ సైన్సెస్ (XE), హ్యుమానిటీస్ & సోషల్ సైన్సెస్ (XH), లైఫ్ సైన్సెస్ (XL).

అర్హత: గుర్తింపు పొందిన ఇంజినీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్/సైన్స్/కామర్స్/ఆర్ట్స్/హ్యుమానిటీస్ డిగ్రీలో మూడో సంవత్సరం లేదా అంతకంటే పై తరగతిలో చదువుతున్నవారు, లేదా ఇప్పటికే డిగ్రీ పూర్తి చేసినవారు గేట్‌ 2027కు అర్హులు.

దరఖాస్తు విధానం: అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. ఒక అభ్యర్థి ఒక దరఖాస్తు మాత్రమే చేయాలి. ఒకవేళ రెండు పేపర్లు రాయాలనుకుంటే.. ఒకే ఫారమ్‌లో దాన్ని పేర్కొనాల్సి ఉంటుంది. ఒకటికంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పిస్తే తిరస్కరిస్తారు. వాటికి చెల్లించిన ఫీజును రిఫండ్‌ చేయరు.

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు కోసం ఒక్కో టెస్ట్‌ పేపర్‌కు మహిళలు/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులైతే.. రూ.1000, ఇతర కేటగిరీలు, విదేశీ విద్యార్థులు రూ.2000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

పరీక్ష విధానం: మల్టిపుల్‌ చాయిస్‌ క్వశ్చన్స్‌, మల్టిపుల్‌ సెలక్ట్‌ క్వశ్చన్స్‌, న్యూమరికల్‌ అన్సర్‌ టైప్‌ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష 3 గంటల పాటు జరుగుతుంది. 65 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి.

ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 14.08.2026

చివరి తేదీ: 21.09. 2026

ఆలస్య రుసుముతో చివరి తేదీ: 30.09.2026

కేటగిరీ/పేపర్/పరీక్ష కేంద్రం మార్పులకు చివరి తేదీ: 21.10.2026

పరీక్ష తేదీలు: వచ్చే ఏడాది ఫిబ్రవరి 6, 7, 13, 14, 20, 21 తేదీల్లో (శని, ఆదివారాల్లో) రెండు సెషన్లలో జరుగుతుంది. ఉదయం
9:30-12:30, మధ్యాహ్నం 2:30-5:30.

Website: https://gate2027.iitm.ac.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram