ఎన్‌టీఏ- జిప్‌మ్యాట్‌ 2026

ఎన్‌టీఏ- జిప్‌మ్యాట్‌ 2026

2026- 2027 విద్యా సంవత్సరానికి ఐఐఎం బోధ్‌గయ, ఐఐఎం జమ్ములో ఉమ్మడిగా అందిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌(ఐపీఎం)లో ప్రవేశాలకు సంబంధించి జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జిప్‌మ్యాట్) - 2026 నోటిఫికేషన్‌ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) విడుదల చేసింది. 

వివరాలు:

జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జిప్‌మ్యాట్‌) - 2026.

ప్రోగ్రామ్‌ వివరాలు:

మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ)

పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌

ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఐపీఎం)

వ్యవధి: అయిదేళ్లు.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌/ పన్నెండో తరగతి/ 10+2 (ఆర్ట్స్/కామర్స్/సైన్స్ గ్రూప్‌) ఉత్తీర్ణులై ఉండాలి. 2024, 2025 సంవత్సరాల్లో లేదా 2026 చివరి సంవత్సరం ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష మొత్తం 400 మార్కులకు 150 నిమిషాల్లో ఉంటుంది. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 33 ప్రశ్నలు 132 మార్కులు, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రిజనింగ్‌ 33 ప్రశ్నలు 132 మార్కులు, వెర్బల్‌ ఎబిటిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ 34 ప్రశ్నలు 136 మార్కులకు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ఓబీసీ అభ్యర్థులకు రూ.2,200; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌/ట్రాన్స్‌జెండర్‌ అభ్యర్థులకు రూ.1,100.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 16.04.2026.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు చివరి తేదీ: 10-05-2026.

పరీక్ష రుసుము చెల్లింపు చివరి తేదీ: 11-05-2026.

దరఖాస్తు సవరణ తేదీలు: మే 12 నుంచి 14 వరకు.

పరీక్ష తేదీ: 07.06.2026.

Website:https://exams.nta.nic.in/jipmat/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram