ఐఐఎఫ్‌టీ కాకినాడలో ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం

ఐఐఎఫ్‌టీ కాకినాడలో ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ), కాకినాడ క్యాంపస్‌లో ఐదేళ్ల ‘ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌’ (ఐపీఎం)లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇంటర్మీడియట్‌ తర్వాత మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో చేరాలనుకున్నవారు ఐఐఎఫ్‌టీకి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. సీటు కోసం ఐఐఎం ఇందౌర్‌ మేలో నిర్వహించే ఐపీమ్యాట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి.  

వివరాలు:

ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఐసీఎం): 2026-2031

సీట్లు: 60. 

అర్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్‌ (12వ తరగతి)లో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలకు 55 శాతం ఉంటే సరిపోతుంది. ఇంటర్‌లో మ్యాథ్స్, స్టాటిస్టిక్స్‌లలో ఏదైనా చదివి ఉండాలి. ఆగస్టు 1, 2006 తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

ప్రయోజనాలు: 

డ్యూయల్‌ డిగ్రీ: ఐదేళ్ల కోర్సు పూర్తిచేస్తే బీబీఏ (బిజినెస్‌ అనలిటిక్స్‌), ఎంబీఏ (ఇంటర్నేషనల్‌ బిజినెస్‌) డిగ్రీలు లభిస్తాయి. మూడేళ్లు బీబీఏ కోర్సు పూర్తిచేసిన తర్వాత ఐఐఎఫ్‌టీ నుంచి బయటకు రావచ్చు. 
గ్లోబల్‌ ఎక్స్‌పోజర్‌: ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ మీద ప్రత్యేక శిక్షణ ఉండడం వల్ల విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

ప్లేస్‌మెంట్స్‌: ఐఐఎఫ్‌టీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఇక్కడ కోర్సు పూర్తిచేసిన వారికి సగటు వార్షిక వేతనం రూ.27 లక్షలు నుంచి రూ.29 లక్షలు వరకు అందుతోంది. మెకిన్సే, డెలాయిట్, అమెజాన్‌ లాంటి సంస్థలు వీరిని ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి.

పరీక్ష విధానం:

ఐపీమ్యాట్‌ పరీక్షలో 3 విభాగాలు ఉన్నాయి. ప్రతి విభాగానికీ 40 నిమిషాల సమయం ఉంటుంది. సరైన సమాధానానికి 4 మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు.

క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ (షార్ట్‌ ఆన్సర్‌): 15 ప్రశ్నలుంటాయి. ఐచ్ఛికాలు ఉండవు. సమాధానాలు టైప్‌ చేయాలి. రుణాత్మక మార్కులు ఉండవు.

క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ (మల్టిపుల్‌ చాయిస్‌): 30 ప్రశ్నలు. రుణాత్మక మార్కులు ఉన్నాయి.

వెర్బల్‌ ఎబిలిటీ (మల్టిపుల్‌ చాయిస్‌ క్వశ్చన్స్‌): 45 ప్రశ్నలు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 20.04.2026.

Website:https://www.iift.ac.in/iift/iiftcampuses.php

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram