ఎన్‌ఐఏఎంటీ, రాంచీలో అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సు

ఎన్‌ఐఏఎంటీ, రాంచీలో అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సు

రాంచీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ (ఎన్‌ఐఏఎంటీ) 2026-27 విద్యా సంవత్సరానికి అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ ఫౌండ్రీ టెక్నాలజీ

అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్‌ ఫోర్జ్ టెక్నాలజీ 

అర్హత: బీఈ, బీటెక్‌/ డిప్లొమా (మెకానికల్, ప్రొడక్షన్, మాన్యుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్, మెటలర్జికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్‌), ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా మ్యాథమెటిక్స్‌లో బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న వారు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, కౌన్సెలింగ్ ఆధారంగా.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ముందుగా క్యూఆర్‌ కోడ్ ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించి తర్వాత వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి. పూర్తి చేసిన దరఖాస్తు హార్డ్ కాపీని, అవసరమైన సర్టిఫికెట్లు, సంతకం చేసి "అసిస్టెంట్ రిజిస్ట్రార్ (అకడమిక్), ఎన్‌ఐఏఎంటీ, రాంచీ" చిరునామాకు పోస్ట్ ద్వారా పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 30.04.2026.

పరీక్ష తేదీ: 31.05.2026.

Website:http://www.niamt.ac.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram