కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో జనరల్ వర్కర్ పోస్టులు

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో జనరల్ వర్కర్ పోస్టులు

భారత ప్రభుత్వ రంగ సంస్థ, మినిరత్న షెడ్యూల్ 'ఎ' కంపెనీ అయిన కొచ్చి షిప్‌యార్డ్ లిమిటెడ్ (సీఎస్‌ఎల్‌), కాంట్రాక్ట్ ప్రాతిపదికన జనరల్ వర్కర్ (క్యాంటీన్) పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన భారతీయ పురుష అభ్యర్థుల నుంచి వాక్-ఇన్-సెలెక్షన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

  • జనరల్ వర్కర్ (క్యాంటీన్)- 13

అర్హతలు: అభ్యర్థులు కనీసం ఏడో తరగతి (7వ తరగతి) ఉత్తీర్ణులై ఉండాలి. భుత్వ ఫుడ్ క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ నుండి ఫుడ్ ప్రొడక్షన్/ఫుడ్ అండ్ బెవరేజెస్ సర్వీస్ లో ఒక సంవత్సరం సర్టిఫికేట్ కోర్సు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

జీతం: నెలకు రూ.20,200 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం: వాక్‌-ఇన్‌- ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు

వేదిక: కొచ్చిన్ షిప్‌యార్డ్ రిక్రియేషన్ క్లబ్, పెరుమానూర్ గేట్ (తేవర) దగ్గర, కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్, కొచ్చి - 682 015

దరఖాస్తు చివరి తేదీ: 24.11.2026

Website: https://cochinshipyard.in/Careers

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram