సీసీఆర్‌వైఎన్‌లో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు

సీసీఆర్‌వైఎన్‌లో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు

భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కేంద్ర యోగ, ప్రకృతి వైద్య పరిశోధన మండలి (సీసీఆర్‌వైఎన్‌), హరియాణాలోని సెంట్రల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగ అండ్ నేచురోపతి (సీఆర్‌వైఎన్‌) లో వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

మొత్తం పోస్టులు: 12

వివరాలు:

కన్సల్టెంట్ ఫిజిషియన్: 01

యోగ థెరపిస్ట్: 02

అసిస్టెంట్ కన్సల్టెంట్ అకౌంట్స్: 01

ఆఫీస్ అసిస్టెంట్: 02

సీనియర్ ఆఫీస్ అసిస్టెంట్: 01

మెయింటెనెన్స్ సీనియర్ ఇంజినీర్: 01

జూనియర్ సివిల్ ఇంజినీర్: 01

వార్డ్ ఆయా: 01

కిచెన్ సూపర్‌వైజర్: 01

పాథాలజిస్ట్/బ్రియోకెమిస్ట్: 01

అర్హత: ప్రొఫెషనల్ ఉద్యోగాలకు బీఎన్‌వైఎస్‌, ఎంబీబీఎస్‌, ఎంబీబీఎస్‌తో పాటు ఎండీ/డీఎన్‌బీ, ఎంఎస్సీ, బీఈ/బీటెక్‌ లేదా హోటల్ మేనేజ్‌మెంట్ డిగ్రీలతో పాటు సంబంధిత అనుభవం ఉండాలి. అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ ఉద్యోగాలకు గ్రాడ్యుయేషన్, డిప్లొమా, టైపింగ్ కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. వార్డ్ ఆయా వంటి పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఆసుపత్రి అనుభవం ఉండాలి.

వయోపరిమితి: పోస్టును బట్టి గరిష్ఠ వయోపరిమితి 64 ఏళ్లు మించకూడదు.

జీతం: పోస్టులను బట్టి నెలకు రూ.22,411 నుంచి రూ.50,000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 26.11.2026

వేదిక: సెంట్రల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగ అండ్ నేచురోపతి, దేవర్‌ఖానా, హరియాణా.

Website:https://www.naturopathyday.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram