ఈఎస్‌ఐసీలో సీనియర్‌ రెసిడెంట్‌ ఉద్యోగాలు

ఈఎస్‌ఐసీలో సీనియర్‌ రెసిడెంట్‌ ఉద్యోగాలు

చెన్నైలోని ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌, కేకే నగర్‌లో మూడేళ్ల కాలపరిమితితో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.

వివరాలు:

  • సీనియర్‌ రెసిడెంట్‌ - 88

విభాగాలు: జనరల్‌ మెడిసిన్‌, రేడియాలజీ, సైకియాట్రీ, ఫిజికల్‌ మెడిసిన్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌, రీప్రొడక్టివ్‌ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ తదితర విభాగాలు...

అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 45 నుంచి 50 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.67,700. ఇతర అలవెన్సులు కలిపి.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించి ఇంటర్వ్యూకు ఎంపిక చేయవచ్చు.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళలు/మాజీ సైనికులకు ఫీజు లేదు. ఇతర అభ్యర్థులు రూ.500 డిమాండ్‌ డ్రాఫ్ట్‌ రూపంలో చెల్లించాలి.

ఇంటర్వ్యూ తేదీ: 2026 నవంబరు 17.

వేదిక: ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌, కేకే నగర్‌, అశోక్‌ పిల్లర్‌ రోడ్‌, చెన్నై - 600078.

Website:https://esic.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram