ఈఎస్‌ఐసీలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు

ఈఎస్‌ఐసీలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు

ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హాస్పిటల్, మానేసర్ (హరియాణా) ఒప్పంద ప్రాతిపదికన ఫుల్ టైమ్/పార్ట్ టైమ్ స్పెషలిస్ట్‌లు, సీనియర్ రెసిడెంట్లు, సూపర్‌ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి వాక్-ఇన్-ఇంటర్వ్యూ ప్రకటన విడుదల చేసింది.

మొత్తం పోస్టుల సంఖ్య: 31

వివరాలు:

  1. ఫుల్ టైమ్/పార్ట్ టైమ్ స్పెషలిస్ట్‌లు: 12

  2. సీనియర్ రెసిడెంట్లు : 18

  3. పార్ట్ టైమ్ సూపర్‌ స్పెషలిస్ట్: 01

విభాగాలు: అనస్థీషియా, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, పల్మనాలజీ, యాక్సిడెంట్ & ఎమర్జెన్సీ/క్యాజువాల్టీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయోలాజీ, సర్జరీ, ఈఎన్‌టీ, రేడియాలజీ, పీడియాట్రిక్స్, మెడికల్ ఆంకాలజీ.

అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా/పీజీ డిగ్రీ/ఎంబీబీఎస్/సూపర్ స్పెషాలిటీ డిగ్రీ/డిప్లొమాతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వేతనం: పోస్టును బట్టి సీనియర్ రెసిడెంట్లకు రూ.67,700 + అలవెన్సులు చెల్లిస్తారు. స్పెషలిస్ట్‌లు/సూపర్ స్పెషలిస్ట్‌లకు రూ.60,000 నుంచి రూ.1,72,572 వరకు చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ: వాక్-ఇన్-ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీ: 2026 అక్టోబరు 12

వేదిక: ఈఎస్‌ఐసీ హాస్పిటల్, ప్లాట్ నెం. 41, సెక్టర్-03, ఐఎమ్‌టీ మానేసర్, గురుగ్రామ్, హర్యానా - 122050.

Website:https://esic.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram