గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మహబూబ్‌నగర్‌లో పోస్టులు

గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మహబూబ్‌నగర్‌లో పోస్టులు

తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్, జూనియర్ రెసిడెంట్ పోస్టులను కాంట్రాక్ట్/తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయడానికి వాక్-ఇన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • మొత్తం పోస్టుల సంఖ్య : 149

వివరాలు:

ప్రొఫెసర్: 08 పోస్టులు

అసోసియేట్ ప్రొఫెసర్: 19 పోస్టులు

అసిస్టెంట్ ప్రొఫెసర్: 62 పోస్టులు

ట్యూటర్: 10 పోస్టులు

జూనియర్ రెసిడెంట్: 50 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌, ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సీనియర్ పోస్టులకు సంబంధిత బోధనానుభవం/పరిశోధన అనుభవం తప్పనిసరి. అభ్యర్థులు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి (ఇతర రాష్ట్రాల అభ్యర్థులు ఎంపికైన వారం రోజుల్లోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి.

వయోపరిమితి: నోటిఫికేషన్ తేదీ నాటికి ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ 69 సంవత్సరాల లోపు ఉండాలి. ట్యూటర్, జూనియర్ రెసిడెంట్‌కు 45 సంవత్సరాల లోపు ఉండాలి.

జీతం/వేతనం: నెలకు ప్రొఫెసర్: రూ.1,90,000; అసోసియేట్ ప్రొఫెసర్: రూ.1,50,000, అసిస్టెంట్ ప్రొఫెసర్ రూ.1,25,000,

ట్యూటర్: రూ.55,000, జూనియర్ రెసిడెంట్: రూ.46,000.

ఎంపిక విధానం: అసిస్టెంట్ ప్రొఫెసర్/ట్యూటర్/జేఆర్‌కు పీజీ(ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ) లేదా ఎంబీబీఎస్‌ డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా.

ప్రొఫెసర్/అసోసియేట్ ప్రొఫెసర్: వారి బోధనా అనుభవం ఆధారంగా. స్థానిక అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు కళాశాల అధికారిక వెబ్‌సైట్ ( www.gmcmbnr-ts.org ) నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. నింపిన దరఖాస్తు ఫారమ్‌తో పాటు అన్ని అసలు విద్యార్హత సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకుని వాక్-ఇన్ ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావాలి.

వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 15.09.2026.

ఫలితాల వెల్లడి: 17.09.2026

విధుల్లో చేరడానికి చివరి తేదీ: 30.09.2026

ఇంటర్వ్యూ వేదిక: ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఏదిర క్యాంపస్, తిరుమల హిల్స్, మహబూబ్‌నగర్ జిల్లా.

Website: https://gmcmbnr-ts.org/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram