ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) 2026-27 విద్యా సంవత్సరానికి ఓఎన్‌జీసీ మెరిటోరియస్ స్కాలర్‌షిప్ పథకం కింద దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, ఎంబీఏ, జియాలజీ/జియోఫిజిక్స్ కోర్సుల్లో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ ఉపకార వేతనానికి అర్హులు. దేశవ్యాప్తంగా మొత్తం 1,000 మందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి ఏడాదికి రూ.48 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది.
వివరాలు:
ఓఎన్‌జీసీ ఏటా మొత్తం 2000 స్కాలర్‌షిప్పులు అందిస్తోంది. వీటిలో ఎస్సీ, ఎస్టీలకు 1000, ఓబీసీలకు 500, జనరల్ అభ్యర్థులకు 500 కేటాయించారు. అన్ని విభాగాల్లోనూ 50 శాతం స్కాలర్‌షిప్పులు మహిళలకు దక్కుతాయి. సంబంధిత విభాగాల్లో యూజీ, పీజీ కోర్సులు చదువుతున్నవారు అర్హులు. ఎంపికైనవారికి నెలకు రూ.4000 చొప్పున ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్పు అందుతుంది. కోర్సు పూర్తయినంత వరకు ఈ ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది.
ఎవరికి: దేశంలో చదువుతోన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ కేటగిరీ (ఈడబ్ల్యుఎస్)ల్లో వెనుకబడిన ప్రతిభావంతులైన పేదలకు
అర్హత: ఏదైనా విద్యాసంస్థలో ఫుల్‌టైమ్ కోర్సు రెగ్యులర్ విధానంలో చదువుతున్నవారై ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఇంజినీరింగ్(బీఈ/బీటెక్), ఎంబీబీఎస్ లేదా పీజీ స్థాయిలో జియాలజీ/ జియోఫిజిక్స్/ ఎంబీఏ వీటిలో ఏ కోర్సులోనైనా ప్రథమ సంవత్సరం విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. అలాగే ఎమ్మెస్సీ- జియాలజీ/ జియోఫిజిక్స్ లేదా ఎంబీఏ కోర్సులు చదువుతున్న విద్యార్థులైతే డిగ్రీలో 60 శాతం ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలైతే రూ.4.5 లక్షల కంటే తక్కువ ఉండాలి.
వయసు: ఆగస్టు 1, 2026 నాటికి 30 ఏళ్లకు మించరాదు.
ఎంపిక: ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ కోర్సులకు ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా; ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్ కోర్సులకు డిగ్రీ మార్కులతో స్కాలర్‌షిప్పులు మంజూరు చేస్తారు.
స్కాలర్‌షిప్పు వ్యవధి: ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ కోర్సుల్లో చేరినవారికి నాలుగేళ్లు; ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్ కోర్సుల్లో చేరినవాళ్లకు రెండేళ్ల పాటు నెలకు రూ.4000 చొప్పున చెల్లిస్తారు.
కోర్సులవారీగా ఎన్ని?
ఇంజినీరింగ్: 500 (ఎస్సీ, ఎస్టీ), 300 ఓబీసీ, 300 జనరల్
ఎంబీబీఎస్: 90 (ఎస్సీ, ఎస్టీ), 50 ఓబీసీ, 50 జనరల్
ఎంబీఏ: 140 (ఎస్సీ, ఎస్టీ), 50 ఓబీసీ, 50 జనరల్
జియాలజీ/ జియోఫిజిక్స్: 270 (ఎస్సీ, ఎస్టీ), 100 ఓబీసీ, 100 జనరల్.
దేశ వ్యాప్తంగా విభజించిన 5 జోన్లలో ఒక్కో జోన్ నుంచి ఎస్సీ, ఎస్టీలకు 200, ఓబీసీలకు 100, జనరల్ అభ్యర్థులకు 100 చొప్పున వీటిని ఇస్తారు. అభ్యర్థులు చదువుతోన్న కళాశాల ఉన్న రాష్ట్రం ప్రకారం జోన్ నిర్ణయిస్తారు. ఏపీ, తెలంగాణలు జోన్ 5 పరిధిలో ఉన్నాయి.
నిబంధనలు:
వేరే ఏ స్కాలర్‌షిప్పులూ మంజూరు కానివాళ్లే ఓఎన్‌జీసీ ప్రోత్సాహకాలకు అర్హులు. ఎంపికైనవారి వివరాలను ఓఎన్‌జీసీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. పైన తెలిపిన కోర్సుల్లో రెగ్యులర్ విధానంలో భారత్‌లో చదివిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. స్కాలర్‌షిప్పు కొనసాగాలంటే ప్రతి సంవత్సరం వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. స్కాలర్‌షిప్ కొనసాగింపు కోసం, విద్యార్థులు నిర్దేశిత ఫార్మాట్‌లో ఆన్‌లైన్ అప్లికేషన్ రెనివల్ పంపవలసి ఉంటుంది.
దరఖాస్తు విధానం: అర్హులైన విద్యార్థులు ముందుగా నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP)లో నమోదు చేసుకుని వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) నంబరు పొందాలి. అనంతరం ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్ అధికారిక వెబ్‌సైట్‌లో 'First Time Registrant' ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వచ్చిన పాస్‌కీతో లాగిన్ అయి, ఓటీఆర్ నంబరు నమోదు చేసి వ్యక్తిగత, విద్యార్హత వివరాలు సమర్పించాలి. అవసరమైన ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తు, ధ్రువపత్రాలపై కళాశాల ప్రిన్సిపల్/డీన్ ధ్రువీకరణ తీసుకుని, వాటి హార్డ్‌కాపీలను నిర్దేశిత ఓఎన్‌జీసీ కార్యాలయానికి పంపాలి.
ఓఎన్‌జీసీ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదుచేయాలి. వయసు, కుల ధ్రువీకరణ, పదో తరగతి మార్కులు, ఇంటర్ లేదా గ్రాడ్యుయేషన్ మార్కులు, ఆదాయ ధ్రువీకరణ, బ్యాంకు అకౌంట్, పాన్ కార్డు, కాలేజీ ఐడీ, ప్రవేశ వివరాలు తదితర పత్రాలన్నీ అందించాలి.
దరఖాస్తు చివరి తేదీ: 30.11.2026.
Link copied to clipboard!
ఐఐటీ బీహెచ్‌యూలో లైబ్రరీ ప్రొఫెషనల్ ట్రెయినీ పోస్టులు
సీఆర్పీఎఫ్లో స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు
ఎయిమ్స్ డియోగఢ్లో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
ఎయిమ్స్ మంగళగిరిలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు
గాంధీ ఆసుపత్రి, సికింద్రాబాద్‌లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో ఫెసిలిటీ మేనేజర్ ఉద్యోగాలు
ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలో మెంబర్ పోస్టులు
చెన్నై ఎస్ఈఆర్సీలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
ఏపీ రిసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏపీఆర్‌సెట్)-2025-26
జేఎన్ఏఎఫ్ఏయూ, హైదరాబాద్‌లో పీహెచ్డీ ప్రవేశాలు
సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్-2027 - 6, 9 తరగతుల్లో ప్రవేశాలు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సులు
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)-సెషన్-1 2027
విట్‌లో బీటెక్ ప్రోగ్రాం
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
ముంబయి పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్ ఉద్యోగాలు
స్విమ్స్ తిరుపతిలో నర్సింగ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎస్‌జేవీఎన్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎన్‌సీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇస్రో- స్పేస్ అప్లికేషన్ సెంటర్లో ఉద్యోగాలు
నార్తర్న్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో అప్రెంటిస్ పోస్టులు
రైట్స్‌లో అప్రెంటిస్‌షిప్ పోస్టులు
ఆర్ఆర్సీ- సెంట్రల్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ బ్యాంకులో అప్రెంటిస్ పోస్టులు
‘టైమ్ 100 నెక్స్ట్ ఇండియా’ జాబితా
కాంటార్ నివేదిక
యూఎన్ఎఫ్పీఏ నివేదిక
యునెస్కో విద్యా నివేదిక-2025
ఫ్యూ రిసెర్చ్ సెంటర్ అంచనా
పీఆర్ఎస్ నివేదిక
‘ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆఫ్ పీఎల్ఐ స్కీమ్స్’
ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నివేదిక-2026
హెచ్ఎస్బీసీ హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్-2026
అత్యంత కాలుష్య ప్రాంతం లోనీ
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ దినోత్సవం
అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం
జాతీయ సమైక్యతా దినోత్సవం
జాతీయ పత్రికా దినోత్సవం
బాలల దినోత్సవం
జాతీయ విద్యా దినోత్సవం
శాంతి - అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవం
ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం
అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వ్‌ల దినోత్సవం
ప్రపంచ నగరాల దినోత్సవం