ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన వికలాంగ విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (KEF) కోటక్ సురక్షా స్కాలర్షిప్ (KSS)ను అందిస్తోంది. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ స్కాలర్షిప్ ద్వారా అర్హులైన అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు ఏటా రూ.1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందుతుంది. దేశవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు:
అర్హత: 2016 నాటి దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ బెంచ్‌మార్క్ డిజేబిలిటీ ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. చెల్లుబాటయ్యే వికలాంగ ధ్రువపత్రం తప్పనిసరిగా ఉండాలి. 12వ తరగతి/ హయ్యర్ సెకండరీలో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల కంటే తక్కువగా ఉండాలి.
స్కాలర్షిప్ ప్రయోజనాలు:
ఎంపికైన ప్రతి విద్యార్థికి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు/డిగ్రీ పూర్తయ్యే వరకు ఏటా రూ.1 లక్ష స్కాలర్షిప్ అందుతుంది. ఈ మొత్తాన్ని ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, ఇంటర్నెట్, రవాణా, ల్యాప్‌టాప్, పుస్తకాలు, స్టేషనరీ వంటి విద్యా ఖర్చులకు వినియోగించుకోవచ్చు.
అంతేకాకుండా ప్రతి స్కాలర్‌కు ప్రత్యేకంగా మెంటర్‌ను కేటాయించి విద్యా ప్రగతి, వ్యక్తిగత అభివృద్ధికి మార్గదర్శకత్వం అందిస్తారు. మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, సామాజిక-భావోద్వేగ స్థైర్యాన్ని పెంపొందించేందుకు నిపుణులతో ప్రత్యేక సెషన్లు నిర్వహిస్తారు. కమ్యూనికేషన్, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్, ప్రొఫెషనల్ ఎటికెట్, ఉద్యోగానికి అవసరమైన సాఫ్ట్ స్కిల్స్‌పై కూడా శిక్షణ ఇస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి?:
ఆన్లైన్లో ‘Apply Now’ పై క్లిక్ చేసి ఈమెయిల్, మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం పాస్వర్డ్ సెట్ చేసి దరఖాస్తు ఫారంలో అవసరమైన వివరాలను నమోదు చేయాలి. సూచించిన పత్రాలను అప్లోడ్ చేసి, అప్లికేషన్‌ను మరోసారి పరిశీలించి సబ్మిట్ చేయాలి. దరఖాస్తు విజయవంతంగా సమర్పించిన తర్వాత ఈ-మెయిల్‌కు సమాచారం ఇస్తారు.
అవసరమైన ధ్రువపత్రాలు:
వికలాంగ ధ్రువపత్రం తప్పనిసరి
విద్యార్థి బ్యాంక్ పాస్‌బుక్/బ్యాంక్ స్టేట్మెంట్
2025-26 కుటుంబ ఆదాయ ధ్రువపత్రం/తల్లిదండ్రుల ఐటీఆర్/ఫార్మ్ 16
2026-27 విద్యా సంవత్సర ఫీజు వివరాలు
కాలేజీ ఫీజు వివరాలు
10వ తరగతి మార్కుల మెమో
12వ తరగతి మార్కుల మెమో
తాజా మార్కుల మెమో
కాలేజీ ఐడీ కార్డు/బోనఫైడ్ సర్టిఫికెట్
విద్యార్థి ఆధార్ కార్డు రెండు వైపులా
సింగిల్ పేరెంట్/అనాథ విద్యార్థులకు సంబంధిత ఆధారాలు, అవసరమైతే తల్లిదండ్రి మరణ ధ్రువపత్రం
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చివరి తేదీ: 15.10.2026
Website: https://www.kotakeducationfoundation.org/what-we-do/scholarship/kotak-suraksha-scholarship
Link copied to clipboard!
ఇస్రో- ఎస్‌ఏసీలో రిసెర్చ్ ఫెలో/అసోసియేట్ పోస్టులు
హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో జనరల్ మేనేజర్ ఉద్యోగాలు
సీఐపీఈటీలో ఉద్యోగాలు
ఎన్జీఆర్ఐ, హైదరాబాద్‌లో టెక్నీషియన్ పోస్టులు
సీడ్యాక్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో సీనియర్ ఇంజినీర్ పోస్టులు
బీఈసీఐఎల్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు
నంద్యాల జిల్లా అంగన్వాడీల్లో ఉద్యోగాలు
ఎయిమ్స్ దిల్లీలో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టులు
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ 2026
నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలు
ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో యూజీ ఆయూష్ 2026 అడ్మిషన్లు
డా. ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో పోస్ట్ బేసిక్ బి.ఎస్.సి.నర్సింగ్ ప్రవేశాలు
రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (ఆర్ఐఎంసీ)లో 8వ తరగతి ప్రవేశాలు
జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్-2027)
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్-ఇన్-సర్వీస్ టీచర్స్-2026)
ఐపీఈ, హైదరాబాద్‌లో స్పాట్ అడ్మిషన్లు
ఏపీ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ ప్రవేశాలు
గేట్ 2027 నోటిఫికేషన్
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
ఈఎస్ఐసీ ఇందౌర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఈఎస్ఐసీలో టీచింగ్ ఉద్యోగాలు
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు
డీఆర్డీఓ - ఎన్‌పీఓఎల్ కొచ్చిలో జేఆర్ఎఫ్ పోస్టులు
ఈఎస్ఐసీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ/ సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మహబూబ్‌నగర్‌లో పోస్టులు
కుమరం భీమ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసిఫాబాద్‌లో టీచింగ్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఎన్బీఆర్ఐలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
ఐసీఏఆర్ - ఎన్ఆర్సీబీలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
ఆర్ఆర్సీ- సదరన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఎంటీపీఎఫ్, అంబర్‌నాథ్‌లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
హైదరాబాద్ ఎన్ఎఫ్సీలో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
4 ఆధ్యాత్మిక సంస్థలతో కేంద్రం ఒప్పందం
స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2026
8 హైకోర్టులకు సీజేల నియామకం
77% పాఠశాలల్లో బాలికలకు విడిగా శౌచాలయాలు
ఖరీఫ్‌లో 19% తగ్గిన సాగు విస్తీర్ణం
మోదీ విదేశీ పర్యటన
భారతీయ ప్రామాణిక సమయం నోటిఫై
మధ్యవర్తిత్వ మండలి ఏర్పాటు
లద్దాఖ్‌లో జమ్మూకశ్మీర్ హైకోర్టు ధర్మాసనం
యుద్ధ ట్యాంకుల పునరుద్ధరణ కేంద్రం
ఆగస్టు అత్యధిక ఉష్ణోగ్రత నెల
ఏఎస్కే ప్రైవేట్ వెల్త్ హురున్ ఇండియా జాబితా
అంటార్కిటికాలో పెరిగిన మంచు
ఫైనాన్షియల్ టైమ్స్ ర్యాంకులు
అల్ట్రాటా నివేదిక
‘ఏటీఆర్’ అధ్యయనం
మైక్రోసాఫ్ట్ వర్క్ ట్రెండ్ ఇండెక్స్ 2026
బట్ట మేక పక్షులను రక్షించుకోవాలి
ఐసీఐఎంఓడీ పరిశోధన నివేదిక
మిషిగన్ విశ్వవిద్యాలయ అధ్యయనం
‘అన్ ఇన్కార్పొరేటెడ్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్’
పురావస్తు రక్షిత స్థలాలుగా కొండారెడ్డి బురుజు, లింగాలకొండ
కొత్త జిల్లా పరిషత్తులు
ఆర్టీసీ ఎండీగా కోన శశిధర్
తెలుగు భాషా పురస్కారాలు
‘సంజీవని’ ప్రాజెక్టు
లోకాయుక్తగా జస్టిస్ మల్లికార్జునరావు ప్రమాణం
పెరిగిన ఎస్సీ, ఎస్టీల జనాభా
పంచాయతీరాజ్ సంస్థల్లోనూ 34% రిజర్వేషన్
పురపాలక శాసనాల నాలుగో సవరణ బిల్లు