కొంకణ్‌ రైల్వేలో అప్రెంటిస్‌ పోస్టులు

కొంకణ్‌ రైల్వేలో అప్రెంటిస్‌ పోస్టులు

కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (కేఆర్‌సీఎల్‌), 1961/1973 అప్రెంటిస్ చట్టం ప్రకారం వివిధ విభాగాల్లో ఒక సంవత్సరం శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. 

వివరాలు:

విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ & జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్స్.

మొత్తం ఖాళీలు: 190.

అర్హత: 2021 నుంచి 2025 మధ్య సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా NATS పోర్టల్‌లో నమోదై ఉండాలి. 

వయోపరిమితి: 01.01.2026 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ-ఎన్‌సీఎల్‌ అభ్యర్థులకు 3 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది. 

స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.9,000, డిప్లొమా అప్రెంటిస్‌లకు నెలకు రూ.8,000 చెల్లిస్తారు (ఇందులో 50% DBT ద్వారా అందుతుంది).

ఎంపిక విధానం: అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా (మెరిట్ లిస్ట్) ఎంపిక చేస్తారు. కొంకణ్ రైల్వే ప్రాజెక్ట్ కోసం భూమి కోల్పోయిన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. 

దరఖాస్తు రుసుము: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనారిటీలు & ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21 మార్చి 2026.

Website:https://konkanrailway.com/en/vacancy

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram